వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రత్నాకర్‌కు కేంద్రమంత్రి తనయుడి అండ, అందుకే రాచమర్యాదలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: సత్యసాయి ట్రస్టు సభ్యుడు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సోదరుడి తనయుడు రత్నాకర్‌కు ఓ కేంద్రమంత్రి కుమారుడితో స్నేహం ఉందని తెలుస్తోంది. అందుకే రత్నాకర్, శ్రీనివాసన్‌, ట్రస్టు అక్రమాలపై పోలీసులు తన విచారణను ఖచ్చితంగా చేయడం లేదని తెలుస్తోంది. కేంద్రమంత్రి తనయుడితో రత్నాకర్‌కు సాన్నిహిత్యం ఉన్నందున కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి విచారణ చేసే పోలీసులకు ఒత్తిళ్లు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రత్నాకర్ వ్యవహారం చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అందుకే రత్నాకర్, శ్రీనివాసన్‌లకు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో డిజిపి అరవిందరావు విలేకరులతో మాట్లాడుతూ ట్రస్టు వ్యవహారంపై మాట్లాడారు. సత్యసాయి ట్రస్టు అక్రమాలపై విచారణ సక్రమంగానే సాగుకుందన్నారు. అలాగే మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో స్నేహం ఉన్నట్లుగా భావిస్తున్న ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ అరెస్టు తర్వాత హత్య కేసు విచారణ చురుగ్గా సాగుతుందన్నారు.

English summary
Some were suspecting that Sathya Sai Trust member Ratnakar has links with union minister son. Its seems, Police were getting pressure from union ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X