వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జే డే హత్య కేసును ఛేదించిన ముంబై పోలీసులు, ఏడుగురి ఆరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jyotirmoy Dey
ముంబై: సీనియర్ జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్య కేసును ఛేదించామని ముంబై పోలీసులు చెప్పుకుంటున్నారు. జే డే హత్య కేసులో ముంబై పోలీసులు ఆదివారం రాత్రి ఏడుగురిని అరెస్టు చేశారు. ఇది కాంట్రాక్టు కిల్లింగ్ కేసుగా కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. హంతకులు ఛోటా రాజన్ గ్యాంగ్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే, జే డే హత్యకు కారణం ఏమిటనేది తెలియదు.

విస్తృతంగా విచారించిన అనంతరం పోలీసులు ముంబైకి, కర్ణాటకకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు 70 మందికి పైగా విచారించారు. మిడ్ డే సీనియర్ క్రైమ్ జర్నలిస్టు జె డె జూన్ 11వ తేదీన పొవాయిలోని ఓ షాపింగ్ మాల్ బయట హత్యకు గురయ్యారు. హత్యకు వ్యక్తిగత, వృత్తిపరమైన శత్రుత్వాలు ఏ మేరకు కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆయిల్ మాఫియా జె డే హత్యకు పూనుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు.

English summary
The Mumbai Police claim to have made a breakthrough in the murder case of senior journalist Jyotirmoy Dey, with the arrest of seven people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X