హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయిబాబాబా సామ్రాజ్యానికి అరబిందో నమూనా, ప్రభుత్వ స్వాధీనం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
హైదరాబాద్: పాండిచ్చేరిలోని అరబిందో సొసైటీని కేంద్ర ప్రభుత్వం తన స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లుగా సత్య సాయిబాబా సామ్రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబా ఏర్పాటు చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టును సరైన దారిలో పెట్టడానికి ఆ నమూనా పనికి వస్తుందా, లేదా అనే విషయంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ట్రస్టు నిర్మాణాన్ని కదలించకుండా శ్రీ అరబిందో సొసైటీ విషయంలో మాదిరిగా ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ అడ్మినిస్ట్రేటర్‌ను నియమిస్తే బాగుంటుందని కొందరు మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.

ట్రస్టును స్వాధీనం చేసుకుని అడ్మినిష్ట్రేటర్ ద్వారా నడిపించాలనే విషయంపై ప్రభుత్వం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ట్రస్టును స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుందా, లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సత్య సాయి బాబా మరణం తర్వాత శ్రీ అరబిందో సొసైటీ మదర్ మేడమ్ ఎఁ అల్పాస్సీ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులే పుట్టపర్తిలో నెలకొన్నాయి. ఈ స్థితిలో 1988లో కేంద్ర ప్రభుత్వం అరబిందో సొసైటీని స్వాధీనం చేసుకుంది.

ప్రస్తుతం శ్రీ సత్య సాయి బాబా సెంట్రల్ ట్రస్టు సంపద తరలింపు కేసులో నిండా మునిగిపోయి ఉంది. ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్‌లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే రత్నాకర్‌ను పోలీసులు విచారించారు. శ్రీనివాసన్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ స్థితిలో ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
The Andhra Pradesh government is studying the takeover case of Sri Aurobindo society, Pondicherry, by the Union government, to consider whether the same model could be followed to set right the Sathya Sai Baba Central Trust founded by spiritual guru Sathya Saibaba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X