హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్యనారాయణ లీడ్, వంట గ్యాస్ ధర తగ్గింపునకు కసరత్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: పెట్రో ధరల హెచ్చింపుపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లీడ్ తీసుకున్నారు. వంట గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించడానికి వీలుగా కసరత్తు ప్రారంభించారు. వాటిపై పన్ను తగ్గించేందుకు ఓ కమిటీని వేశారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ విషయాలపై చర్చించారు. ప్రభుత్వంపై 191 కోట్ల రూపాయల భారం పడుతున్నా వంటగ్యాస్ ధర తగ్గించేందుకు ముందుకు రావాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఆర్టీసి చార్జీల పెంపు వల్ల ప్రజలపై పెద్ద యెత్తున భారం పడకుండా డీజిల్ అమ్మకం పన్నును కూడా తగ్గించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఆర్టీసి బస్సు చార్జీలు పెంచే ప్రతిపాదనకు కూడా రవాణా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిని కూడా అధ్యయనం చేస్తామని యన చెప్పారు. ఆర్టీసి బస్సు చార్జీలను పొరుగు రాష్ట్రాల్లో కూడా పెంచారని, ఆర్టీసి తీవ్రమైన నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచకపోతే నష్టాల నుంచి గట్టెక్కడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. సామాన్యులపై భారం పడకుండా ఆర్టీసి బస్సు చార్జీలను పెంచుతామని ఆయన చెప్పారు.

English summary
PCC President Botsa Satyanarayana takes lead to reduce petro prices hike. He met CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X