హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీ సత్య సాయి ట్రస్టు సభ్యులను వెనకేసుకొచ్చిన మంత్రి గీతారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: పుట్టపర్తి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులను మంత్రి గీతా రెడ్డి వెనకేసుకొచ్చారు. పుట్టపర్తి నుంచి సత్య సాయిబాబా సంపదను తరలిస్తున్నారని ట్రస్టు సభ్యులు రత్నాకర్, శ్రీనివాసన్ ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆమె వారిని బలపరుస్తూ ప్రకటన చేశారు. ట్రస్టు సభ్యుల పనితీరు వల్ల సత్య సాయి బాబాకు చెడ్డ పేరు వస్తుందని తాను అనుకోవడం లేదని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తాను అప్పుడూ ఇప్పుడూ ట్రస్టుకు దూరమేనని ఆమె చెప్పారు. ట్రస్టు సభ్యుల తీరుపై తాను స్పందించబోనని ఆమె అన్నారు. తాను సత్య సాయి బాబా భక్తురాలినేనని ఆమె చెప్పుకున్నారు. సత్య సాయి బాబా భక్తురాలిగా తాను పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. సత్య సాయి బాబా ప్రజల కోసం ఎంతో చేశారని, మంచినీటి సౌకర్యం కల్పించారని, ఉచిత వైద్యం అందించారని ఆమె చెప్పారు. ట్రస్టు సేవా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా మీడియా కూడా నియంత్రణ పాటించాలని ఆమె సూచించారు.

సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాలపై ముఖ్యమంత్రి కమిటీ వేసినప్పుడు కూడా తాను హైదరాబాదులో లేనని, తాను విదేశాల్లో ఉన్నానని ఆమె చెప్పారు. ఇంతకు ముందు సత్య సాయి బాబాను ఆస్పత్రిలో చేరిన వెంటనే పుట్టపర్తి చేరుకున్న ఆమె అక్కడే కొద్ది రోజులు మకాం కూడా వేశారు.

English summary
Minister Geetha Reddy speaks in support of Sri Sathya Sai Baba central Trust members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X