అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీనివాసన్‌కు ఆరు గంటల పాటు ప్రశ్నలు, సత్య సాయి ట్రస్టుకు నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ సోమవారం పోలీసు అధికారుల ముందు హాజరయ్యారు. తమ ముందు హాజరు కావాలని అనంతపురం జిల్లా పోలీసు అధికారులు శ్రీనివాసన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో శ్రీనివాసన్ పోలీసు అధికారుల ముందు హాజరయ్యారు. ఆయనను పోలీసు అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అవసరమైతే శ్రీనివాసన్‌ను మరోసారి ప్రశ్నిస్తామని డిఎస్పీ కోలారు కృష్ణ చెప్పారు.

శ్రీనివాసన్ విచారణకు సంబంధించిన వివరాలను తాను రేపు మంగళవారం వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ట్రస్టు మరో సభ్యుడు రత్నాకర్‌ను పోలీసు అధికారులు ఇప్పటికే విచారించారు. సత్య సాయిబాబాకు సంబంధించిన 35 లక్షల రూపాయల సంపదను తరలించిన కేసులో పోలీసు అధికారులు వారిని విచారించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సోమవారం నోటీసులు జారీ చేసింది. గత ఐదేళ్ల ట్రస్టు ఆర్థిక లావాదేవీలపై పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రస్టుతో పాటు దాని అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కూడా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది.

English summary
Sri Sathya Sai central trust member Srinivasan is questioned by Anantapur district police today. He was grilled for about six hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X