వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వివాదం: సీనియర్ సభ్యుడు భగవతి అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

PN Bhagawati
పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని యజర్ మందిరంలోని 35.50 కోట్ల రూపాయల తరలింపు వివాదం పట్ల శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు జస్టిస్ పిఎన్ భగవతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో సభ్యుడు ఎస్‌వి గిరి కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు, సంపద, నిధుల సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ట్రస్టు సోమవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది.

ప్రశాంతి నిలయం యజర్ మందిరం నుంచి బెంగళూర్‌కు సంపద తరలించిన సంఘటనలో వి. శ్రీనివాసన్, రత్నాకర్ పాత్రపై సీనియర్ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందనే విషయంపై సమాచారం రాబట్టడానికి వారు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ట్రస్టు సభ్యులకు పోలీసులు సమన్లు జారీ చేయడం ప్రశాంతి నిలయం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వ్యవహారం ట్రస్టుకు చెడ్డ పేరు తెస్తుందని భగవతి, గిరి లాంటి వారు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

అతి స్వల్పమైన 35 లక్షల రూపాయల తరలింపు వ్యవహారం సత్య సాయి బాబా అందించిన నిస్వార్థ సేవకు మచ్చ తెచ్చేదిగా ఉందని ఓ సభ్యుడు ఎత్తి చూపినట్లు సమాచారం. సొమ్ము స్వాధీనం కేసును ఆదాయం పన్ను శాఖ చూడాల్సి ఉండగా, పోలీసులు తమ పరిధిని అతిక్రమించి వ్యవహరించారని ఓ సభ్యుడు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ట్రస్టు కార్యకలాపాలపై, ఆర్థిక వ్యవహారాలపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

English summary
Following the notice issued by the state government directing it to produce all the necessary information regarding the properties, assets and funds, the powerful Sathya Sai Central Trust held an emergency meeting in Prasanthi Nilayam here on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X