అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్వాధీనం లేనట్లే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
అనంతపురం: సత్యసాయి ట్రస్టు సభ్యులు ప్రభుత్వానికి పంపించే నివేదిక చూసిన చర్యలు తీసుకునే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గీతారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ట్రస్టును స్వాధీనం చేసుకునే యోచన ప్రభుత్వానికి లేదన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేమని నివేదిక చూశాకే నిర్ణయం ఉంటుందన్నారు. ప్రభుత్వం ట్రస్టును కేవలం నివేదిక మాత్రమే అడిగిందన్నారు. నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. బాబా సేవలను దృష్టిలో ఉంచుకొని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భగవాన్ సత్యసాయి బాబా రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. ట్రస్టు విషయంలో మీడియా కూడా కొంత సంయమనం పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని అన్నారు.

కాగా ట్రస్టుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ట్రస్టు సభ్యులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నివేదికను పదిరోజుల్లో ఇవ్వాలని చెప్పింది. ట్రస్టుకు నిధులు ఎవరిచ్చారు, నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి, నిధుల సమీకరణ, నిర్వహణ విధి విధానాలు, ట్రస్టు సభ్యుల నేపథ్యం, ఐదేళ్లుగా ట్రస్టు లావాదేవీలు, ట్రస్టు అనుబంధ సంస్థల వివరాలు తదితర విషయాలపై ప్రభుత్వం సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

English summary
Minister Geetha Reddy said today that government will take action on Sathya Sai Trust after submitting report on trust. She suggested media to publish transparent on trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X