వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నానో ఇల్లు రూ.14 వేలకే: మహీంద్రా కంపెనీ ప్రాజెక్టు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nano Homes
హైదరాబాద్: ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు టాటా నానో గురించి చెప్పుకుంటున్నాం. ఇకపై నానో హోమ్స్ (నానో ఇల్లు) గురించి చెప్పుకుంటామనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మధ్య తరగతి ప్రజలు కూడా కారులో తిరగాలనే రతన్ టాటా తన కలలకు వాస్తవ రూపం కల్పించి ఎంతో ప్రతిష్టాత్మకంగా టాటా మోటార్స్ లక్ష రూపాయలకే టాటా మోటార్స్ నానో కారును ప్రవేశపెట్టింది. ఇప్పుడు మహీంద్రా గ్రూపుకు చెందిన రియాల్టీ విభాగం కూడా మధ్య తరగతి ప్రజలకు దృష్టిలో ఉంచుకొని చౌక ధరకే నానో ఇల్లు కట్టించే ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నానో ప్రాజెక్టు ద్వారా ఇంటిని కేవలం రూ.14 వేలకే అందించాలన్నది మహీంద్రా సంకల్పం.

నమ్మశక్యం కాక పోయినా ఇది నిజం. మీకు కేవలం 25 చదరపు గజాల స్థలం ఉండి వారికి పదిహేను వేల రూపాయలు చేతిలో పెడితే చాలు మీ ఇల్లు సిద్ధమైనట్లే! మహీంద్రా కంపెనీ నానో ఇంటిని మీకు అన్ని వసతులతో నిర్మించి ఇచ్చే ప్రాజెక్టును త్వరలో తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఉదయం సమయంలో కిచెన్‌గా ఉండే గది రాత్రి అయ్యే వరకు పడక గదిగా మారుతుంది. ఇలా కేవలం 25 చదరపు గజాల్లోనే ఇంటిని నిర్మించి ఇవ్వనున్నారు. మరో విషయం ఏంటంటే ఈ ఇంటికి విద్యుత్ కూడా అవసరం లేదు. సోలార్ పవర్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇక పై భాగాన వర్షపు నీరు నిలువ ఉండేలా కూడా ఏర్పాటు చేస్తారు. వాటిని శుద్ధి చేసి వాడుకోవచ్చు కూడా. ఈ నానో ఇల్లు భారీ వర్షాలను, భూకంపాలను కూడా తట్టుకుంటాయట.

English summary
After the world's cheapest car, India is likely to roll out the world's cheapest housing model costing less than Rs 14,000, with a touch of Harvard. Mahindra Partners, a private equity arm of the Mahindra group, has conceptualized a $293.7 or Rs 13,217 house (not including land cost) that could be explored for global commercial application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X