హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ కెసిఆర్: రక్తపుటేరులపై టి-కాంగ్రెసు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును లక్ష్యంగా చేసుకొని మంగళవారం విమర్శలు గుప్పించారు. మంత్రుల నుండి ఎమ్మెల్సీల వరకు అందరూ కెసిఆర్‌పై విమర్శలు కురిపించారు. మెట్రో రైలు ప్రాజెక్టు చేపడితే హైదరాబాదులో రక్తపుటేరులు పారుతాయన్న కెసిఆర్ వ్యాఖ్యలపై అందరూ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ పిహెచ్‌డి చేశారని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు విమర్శించారు. హైదరాబాదు అభివృద్ధి ఇష్టం లేకనే కెసిఆర్ మెట్రో రైలును అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. మెట్రో రైలు అడ్డుకోవడానికి కెసిఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు.

మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఏకంగా కెసిఆర్‌కు హైదరాబాద్ దెబ్బ రుచి చూపిస్తామని హెచ్చరించారు. మెట్రో రైలును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మెట్రో రైలు కారణంగా మొజంజాహీ మార్కెట్, ఆర్య సమాజ్, సుల్తాన్ బజార్ తదితర చారిత్రక ప్రదేశాలకు నష్టం లేకున్నప్పటికీ కెసిఆర్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కెసఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరో మంత్రి గీతారెడ్డి కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మెట్రో రైలు కోసం ముఖ్యమంత్రి ఎలాంటి డబ్బులు తీసుకోలేదన్నారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తెలంగాణకు కట్టుబడి ఉన్నారని అన్నారు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సాకె శైలజానాథ్ కూడా కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ ఉద్యమం పేరుతో అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. కెసిఆర్ అధికార కాంక్షతోనే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి సొమ్ము చేసుకుంటుందని అన్నారు.

English summary
T-congress leaders targeted TRS president K Chandrasekhar Rao today on Metro project issue. Ministers Danam Nagender, Mukesh Goud, Geetha Reddy were blamed KCR on metro issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X