హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా, జగన్ మధ్య రాజీకి ఆజాద్ యత్నం: యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్య రాయభారం నెరపుతున్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. వైయస్ జగన్, సోనియా గాంధీ ఎవరి లాభం కోసం వారు లాలూచీ పడ్డారని ఆరోపించారు.

యువ కిరణాలు పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర యువతను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ అక్రమంగా సంపాదించిన డబ్బుపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికార కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జగన్‌, సోనియా కుమ్మక్కు కావడం వల్లనే విచారణకు కాంగ్రెసు సిద్ధపడటం లేదన్నారు.

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీరు పదేలను కొట్టి పెద్దలకు పెడుతుందన్నట్లుగా ఉందని మరో నేత అరవింద్ కుమార్ గౌడ్ వేరుగా అన్నారు. 14ఎఫ్ పై మాట్లాడటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలులో పెట్టిన తెలంగాణ నగారాకు ప్రజా స్పందన కరువు కావడంతో ఆయన టిడిపిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు.

English summary
TDP senior leader Yanamala Ramakrishnudu said today that union minster gulam nabi Azad is trying to met AICC president Sonia Gandhi and YSR Congress party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X