హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిజిపిగా అరవింద రావును కొనసాగిస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Aravind Rao
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)గా అరవింద రావునే కొనసాగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిజిపి పదవికి రేసులో ఆరుగురున్నారు. ఈ నెలాఖరును అరవింద రావు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో కొత్త డిజిపి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది. అరవింద రావు కొనసాగడానికి ఇష్టపడకుంటేనే కొత్త డిజిపిని నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

కెఆర్ నందన్, శివశంకర్, ఉమేష్ కుమార్, గౌతం కుమార్, దినేష్ రెడ్డి, బల్వీందర్ సింగ్ డిజిపి పదవి కోసం రేసులో ఉన్నారు. వీరిలో కెఆర్ నందన్ సీనియర్. కోర్టు తీర్పు ప్రకారం నందన్‌ను డిజిపిగా నియమించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వాలు సీనియారిటీతో సంబంధం లేకుండా డిజిపిలను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, నందన్ పదవీకాలం కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఉంది. దీంతో ఆయనను ప్రభుత్వం డిజిపిగా నియమించకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అరవింద రావు కొనసాగించడానికి అంగీకరించకపోతే దినేష్ రెడ్డిని ఎంపిక చేయవచ్చునని అంటున్నారు.

English summary
It is learnt that Aravind Rao may be continued as DGP. Six IPS officers are in race for DGP post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X