చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ఏడుకొండలను అమ్మేస్తుంది: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండలోని ఏడు కొండలను అధికార కాంగ్రెసు ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నాలు చేసిందని, ఇప్పుడు కూడా అమ్మేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన చిత్తూరు జిల్లా పర్యటనలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. టిటిడి, పుట్టపర్తి విషయాలలో ప్రభుత్వం చేతకానితనం బయట పడుతోందన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టుకోలేక పోవడం అసమర్థతే అన్నారు. తాను వ్యవసాయం దండగ అని ఎప్పుడూ అన లేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంలో రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. విద్యుత్ కోతలు, నాసిరకం విత్తనాలు, రుణాలు రీషెడ్యూల్ లేకపోవడం తదితర ఇబ్బందులు అన్నదాతలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలు అన్నీ తీరాలంటే నగదు బదలీ పథకం ఒక్కటే మార్గం అన్నారు. సంపద అంతా కొందరి చేతుల్లోనే ఉండటం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.

జల యజ్ఞాన్ని కాంగ్రెసు ప్రభుత్వం ధన యజ్ఞంగా మార్చారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ రచ్చబండలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కిరణ్ కుర్చీ కాపాడుకోవడంలో బిజీ అయిపోయాడన్నారు. కాంగ్రెసు నేతలు సిండికేట్ అయి రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. బలహీన వర్గాలకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెసు పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. కాంగ్రెసు రాష్ట్రానికి శాపం అన్నారు. మద్య నిషేధంపై చర్చ జరగాలని అన్నారు. కాగా కుప్పం నియోజకవర్గంలో పలువురితో మద్యం తాగమని ప్రమాణం చేయించారు.

English summary
TDP president Chandrababu Naidu blamed congress government today in his chittoor toud. He said congress is neglecting agriculture and farmers. He said government is ready to sale Tirumala seven hills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X