చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

c kalyan
చెన్నై: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ బుధవారం రాత్రి చెన్నైలో అరెస్టయ్యారు. క్లూ బ్రాంచ్, సిఐడి పోలీసులు కలిసి ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను రేపు (గురువారం) హైదరాబాదు తరలించే అవకాశాలున్నాయి. వారం రోజుల క్రితం నిర్మాత శింగనమల రమేష్‌ను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు కళ్యాణ్ కోసం అన్వేషిస్తున్నారు. ఆయన హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

సి. కళ్యాణ్ బుధవారం హైదరాబాదుకు వస్తారనే సమాచారం అందుకున్న సిఐడి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద మాటు వేశారు. వచ్చిన వెంటనే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఆయన ముంబై నుంచి నేరుగా చెన్నై చేరుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయనను చెన్నైలో అరెస్టు చేశారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో కలిసి కళ్యాణ్ సినీ పరిశ్రమలో పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు సిఐడికి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. శింగనమల రమేష్ ద్వారా వివరాలు సేకరించిన సిఐడి పోలీసులు కళ్యాణ్ అరెస్టుకు సిద్ధపడినట్లు భావిస్తున్నారు. ఓ అగ్ర దర్శకుడి నుంచి ఏడు కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా కళ్యాణ్ బెదిరిస్తూ వచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

English summary
Film producer C Kalyan was arrested in Chennai today. He may be shifted to Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X