హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టుకు అలనాటి నటి జమున కూతురు, అల్లుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jamuna
హైదరాబాద్: అలనాటి కథానాయిక జమున కూతురు దంపతులు బుధవారం ఓ కేసులో హైకోర్టుకు హాజరయ్యారు. జమున కూతురు, అల్లుడు రాహుల్ దంపతులు ఇద్దరు హాజరయ్యారు. జడ్జి కెసి భాను ముందు ఇద్దరు తమ తమ వాదనలు వినిపించారు. ముందుగా దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత జడ్జి ముందు వారు తమ తమ వాదనలు భిన్నంగా వినిపించారు. జమున కూతురు తన భర్తతో ఉండటానికి నిరాకరించింది. తాను అతనితో ఉండనని విడాకులు కావాలని కోరింది.

అయితే జమున అల్లుడు రాహుల్ మాత్రం భార్యతో కలిసి ఉంటానని చెప్పాడు. అయితే ఇద్దరి వాదనలు విన్న అనంతరం జడ్జి కేసును జూలై 12వ తేదికి కేసును వాయిదా వేశారు. కాగా గత కొద్దికాలంగా జమున కూతురు, అల్లుడి మధ్య గొడవలు ఉన్న విషయం తెలిసిందే. జమున అల్లుడు రాహుల్ ఈ గొడవలకు కారణం తమ అత్త జమునే కారణం అని, తన భార్య అమాయకురాలని చెప్పాడు. తన అత్తే ఆమెను తప్పుదారి పట్టిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Jamuna daughter and her husband Rahul attended today and told their version to judge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X