వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రతన్ టాటాకు స్వాగతం పలికేందుకు ముస్తాబవుతున్న ప్యాలెస్

|
Google Oneindia TeluguNews

Ratan Tata
సముద్ర-ముఖంగా కొలాబాలో ఒక సొగసైన అందాల మందిరం టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాకు ఆహ్వానం పలికేందుకు ముస్తాబవుతోంది. ఉప్పు నుంచి ఉక్కు, ఉక్కు నుంచి సాఫ్ట్‌వేర్ వ్యాపారం వరకూ భారత్‌లో తిరుగులేని శక్తిగా అవతరించిన రతన్ టాటా వచ్చే ఏడాది తన సామ్రాజ్యం నిష్క్రమిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2012తో 75 వసంతాలు పూర్తి చేసుకోనున్న రతన్ టాటా అదే ఏడాది తన పదవికి రాజీనామా ఇచ్చి పదవీవిరమణ చేయనున్నారు.

పదవీవిరమణ అనంతరం టాటా విశ్రాంతి తీసుకునేందుకు గానూ, ముంబైలోని తీరప్రాంతమైన కొలాబాలో ఓ సుందర గృహం సిద్దమవుతోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ ఇంటికి బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నుంచి పాక్షిక స్వాధీన సర్టిఫికెట్ పొందింది. మూడు అంతస్థులు ఉండే ఈ మేడలో ఒక్కో ఫ్లోర్ రెండేసి లెవల్స్‌ను కలిగి ఉంటుంది., కొలబా పోస్ట్ ఆఫీస్‌కు ఎదురుగా ఉంటుంది. ఇది 13.5 మీటర్ల పొడవులో ఉండి, గ్రౌండ్ ఫ్లోర్‌లో లివింగ్ రూమ్, కిచెన్, బెడ్‌రూమ్ మరియు స్టడీ రూమ్‌లు ఉంటాయి.

గ్రౌండ్ ఫ్లోర్‌ను కూడా భూమి నుంచి కొన్ని అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంది. మొదటి అంతస్థులో ఎక్కువ భాగం సన్ డెక్ ఉండి మొత్తం లివింగ్ ఏరియాగా ఉంటుంది. ఇందులో రెండు పడక గదులు, ఓ స్టడీ రూమ్ ఉంటుంది. ప్రత్యేకించి పార్టీల కోసం రూపొందించినట్లుగా ఈ రూమ్ ఉంటుంది. ఈ లివింగ్‌ రూమ్‌లో దాదాపు 50 మందికి సులువుగా వసతి కల్పించవచ్చు. ఇంకా ఇందులో ఓ బార్ మరియు బార్బెక్యూలు కూడా ఉన్నాయి. ఇక సెకండ్ ఫ్లోర్‌లో రెండు పడక గదులు, ఒక లివింగ్ రూమ్ మరియు ఒక గ్రంధాలయం (లైబ్రరీ) కూడా ఉంది.

ఇకపోతే.. మూడో అంతస్థులో టాటా ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా ఓ అధునాతన మీడియా గది, ఒక పడక గది మరియు అతని వ్యక్తిగత వ్యాయామశాల ఉన్నాయి. ఇదే ఫ్లోర్‌లోని సెకండ్ లెవల్‌లో ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్, ఒక లాంజ్ మరియు ఒక సన్ డెస్క్ ఉంది. ఈ భవంతి బేస్‌మెంట్‌లో సేవకుల క్వార్టర్స్, 10-12 కార్లు పార్కింగ్ చేసే స్థలం ఉండనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటల్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న రతన్ టాటా మరో ఏడాదిన్న కాలం తర్వాత తన పదవికి స్వస్తి పలకనున్న సంగతి తెలిసిందే.

English summary
An elegant sea-facing house at Colaba is getting ready to welcome Tata Group's chairman Ratan Tata, as he retires in next year. The house, yet unnamed, has received a partial occupancy certificate from the Brihanmumbai Municipal Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X