వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా తెలుగు సంబరాల్లో తారల హల్‌చల్‌కు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chinna Jeeyar Swamiji
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 2వ తేదీన శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామీ ఈ సంబరాలను ప్రారంభిస్తారు. రామ్ చరణ్ తేజ, ప్రయమణి, మధుశాలిని, సాక్షి గులాటీ, కృష్ణుడు, కోట శ్రీనివాస రావు, గౌతం రాజు, ఢిల్లీ రాజేశ్వరి, సౌమ్య రాయ్ వంటి తారలు, ఇతర ప్రముఖులు సందడి చేయనున్నారు. తారలందరితో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి.

తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ జరుగుతుంది. గీతా మాధురి, మాలవిక, సుమంగళి, రేవంత్, శ్రీకృష్ణ, వసంత్, సింహ వంటి వారు తమ గానమాధుర్యంతో అలరిస్తారు. ఎల్ఆర్ ఈశ్వరి, ఘంటసాల రత్నకుమారి కూడా తమ ప్రదర్సనలు ఇస్తారు. బాపు, రాఘవేంద్ర రావు, అశ్వినీ దత్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు కూడా తెలుగు సంబరాలను అలరిస్తారు.

గజల్ శ్రీనివాస్ రూపొందించిన తెలుగు తోరణం నృత్య ప్రదర్శన ఉంటుది. శోభా నాయుడు ప్రత్యేకమైన నృత్య ప్రదర్శన చేస్తారు. మిమిక్రీ రమేష్, మైమ్ మధు కార్యక్రమాలు వెంకట్ అర్థనారీశ్వర ప్రదర్శన, మాధవ్ వెంట్రిలాక్యువజిం ఉంటాయి. అమెరికా తెలుగు సంబరాల సందర్భంగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను కూడా కలుసుకోవచ్చు. సాహిత్య కార్యక్రమాలు, యువజన కార్యక్రమాలు, సిఎంఇ కార్యక్రమాలు, అల్యుమినీ సమావేశాలు, మహిళా వేదిక తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

English summary
We are just two days from the inauguration of the America Telugu Sambaralu organized by North America Telugu Society (NATS). Get ready to enjoy the event with family,food,fun and friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X