వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను కిరణ్‌తో లింక్స్ నిజమే: శింగనమల రమేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Singanamala Ramesh
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో తనకు లింక్స్ ఉన్నాయని ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ ఒప్పుకున్నట్లుగా నేరాంగీకార స్టేట్ మెంటు ద్వారా తెలుస్తోంది. సిఐడి పోలీసుల విచారణలో ఆయన తనకు, భానుతో ఉన్న లింక్స్‌ను ఒప్పుకున్నారని సమాచారం. తనకు బి-కంపెనీతో గత కొన్నాళ్లుగా లింక్స్ ఉన్నాయని సిఐడికి శింగనమల చెప్పారు. భానును తనకు మద్దెలచెర్వు సూరి పరిచయం చేశాడని చెప్పారు. తాను భానుతో కలిసి ఫైనాన్షియర్లను బెదిరించిన విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఫైనాన్షియర్లు తనపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడం వల్లనే తాను భానుతో బెదిరింపులకు పాల్పడ్డట్టు చెప్పారు. సెటిల్మెంట్లకూ పాల్పడ్డట్టు చెప్పారు.

కాగా శింగనమల నుండి 20 సిమ్ కార్డులను, 100 బ్లాంక్ చెక్స్ తీసుకున్నారు. మరో నిర్మాత సి.కళ్యాణ్ సైతం ఇప్పటికే భానుతో లింక్స్ ఉన్నట్లు ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సి.కళ్యాణ్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కాగా షాలిమార్ కంపెనీ అధినేత అష్రాఫ్ విలేకరులతో మాట్లాడుతూ తనను భానుతో కలిసి కళ్యాణ్, శింగనమల బెదరించినందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. పోలీసులకు అన్ని వివరాలు అందించానని చెప్పారు. సినిమా కాఫీరైట్స్ కోసం 43 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వకుండా బెదిరించారని చెప్పారు.

English summary
Singanamala Ramesh told to CIP police that he has links with Bhanu Kiran. CID Police produced C.Kalyan in Nampally court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X