వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్ర, వైఖరిపై కసరత్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో తన ఓదార్పు యాత్రను పూర్తి చేసుకున్న ఆయన తర్వాత కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు కర్నాలు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన తెలంగాణలో ప్రవేశించాలనేది ఆయన వ్యూహం. కర్నూలు జిల్లా నుంచి ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజుల పాటు ఓదార్పు యాత్ర చేపట్టాలనేది ఆయన ఆలోచన.

కాగా, ఈ నెల 8వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ విధివిధానాలను ఖరారు చేస్తారు. ఇందులో తెలంగాణ అంశంపై కూడా వైఖరిని ఖరారు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గానీ తాము గానీ వ్యతిరేకం కాదనీ, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని కర్ర విరగకుండా పాము చావకుండా వైయస్ జగన్ తన వైఖరిని ప్రకటిస్తారని అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాడనికి ముందే ఈ వైఖరి వెల్లడి కానుంది. తెలంగాణపై తీసుకోవాల్సిన వైఖరిపై జగన్ ఇప్పటికే తెలంగాణ విద్యార్థి, ప్రజా సంఘాల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా వుంటే, ప్లీనరీ సమావేశానికి ప్రజా ప్రస్థానం అనే పేరు ఖరారు చేశారు. రెండేళ్లకోసారి ప్లీనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి జరిగే ప్లీనరీ సమావేశం మేధోమథనం లాగా జరగాలని ఆయన భావిస్తున్నారు. ఈ సమావేశానికి ఆరు వేల మందికి మించి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. శాసనసభా నియోజకవర్గానికి పది మంది చొప్పున ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు.

English summary
YSR Congress party president YS Jagan to takeup Odarpu Yatra in Telangana. He will enter Mahaboobnagar district from Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X