వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య సాయి మందిరంలో తవ్వుతున్న కొద్దీ సంపద

By Pratap
|
Google Oneindia TeluguNews

Satya Sai Baba
పుట్టపర్తి‌: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గల సత్యసాయి బాబా నివాసం యజర్వేద మందిరంలో తవ్వుతున్న కొద్దీ సంపద బయటపడుతోంది. యజుర్వేద మందిరంలోని అదనపు గదుల్లో ఉన్న సంపదను శనివారం లెక్కించారు. అనంతపురం జిల్లా జేసీ అనితారామచంద్రన్‌, ఏజేసీ చెన్నకేశవరావుల సమక్షంలో ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు లెక్కింపు జరిగింది. ఇందులో ట్రస్టు సభ్యులు కూడా పాల్గొన్నారు. గదుల్లో మొత్తం రూ.76,89,493 విలువైన బంగారం, వెండి, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తేల్చారు. గతంలో ట్రస్టు సభ్యులు బాబా వ్యక్తిగత గదిలోని సంపదను లెక్కించిన విషయం తెలిసిందే.

అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ట్రస్టు సభ్యులే సంపదను లెక్కించడంతో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మందిరంలోని మిగతా గదుల్లో సంపదను అధికారుల సమక్షంలో లెక్కించారు. ప్రభుత్వ ఆదేశాలు, ట్రస్టు సభ్యుల విజ్ఞప్తి మేరకు యజుర్వేద మందిరంలో 10 గదుల్లోని సంపదను లెక్కించినట్లు జెసి అనితా రామచంద్రన్ చెప్పారు. ఇందులో వెండి నగలు 116 కిలోలు, బంగారం 905 గ్రాములు, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తెలిపారు. వెండి విలువ రూ.57,96,607, బంగారం విలువ రూ.15,83,525, వజ్రాల ఉంగరం విలువ రూ.3,09,360 ఉందన్నారు. ముంబయి నిపుణులతో ఆభరణాల విలువ కట్టించామన్నారు. ఈ సంపదను సోమవారం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో జమ చేస్తామని తెలిపారు. వీటితో పాటు బాబా పట్టు వస్త్రాలు, పెన్నులు ఉన్నాయని, వీటి విలువను తర్వలో లెక్కిస్తామని చెప్పారు. యజుర్వేద మందిరం తాళాలు బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ వద్దే ఉన్నాయి. శనివారం ఆయనే తలుపులు తెరిచారు. మందిరంలో ఉన్న 11 గదులనూ పరిశీలించినట్లు జేసీ తెలిపారు. యజుర్వేద మందిరం పక్కనే ఉన్న భవనంలోని సంపదను గురుపౌర్ణమి తర్వాత లెక్కిస్తామన్నారు.

గురు పౌర్ణమి రోజు సత్యసాయి మహాసమాధిని ప్రారంభించనున్నట్లు కౌన్సిల్‌ సభ్యుడు నాగానంద తెలిపారు. సర్వమతాల భక్తులు ఆరాధించేలా సమాధి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తవుతాయని, బాబా పుట్టిన రోజు వేడుకల నాటికి సమాధిపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

English summary
Skeletons continued to tumble out of Prashanti Nilayam with the Anantapur district authorities on Saturday seizing gold, silver, diamond ornaments worth Rs 76.89 lakh from Yajur Mandir, the abode of Satya Sai Baba who passed away on April 24 this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X