వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు వెనుకే మేము ఉంటాం: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన వెంటనే తాము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. తాము రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని టి-కాంగ్రెసు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. అందుకే టి-కాంగ్రెసు వారు చేస్తేనే తాము చేస్తామని చెప్పామని స్పష్టం చేశారు. కెయు విద్యార్థుల దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.

ఇప్పుడు కాంగ్రెసు పార్టీ రాజీనామాలకు ముందుకు వచ్చింది కాబట్టి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి తాము కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీయే అని కాబట్టి ఆ పార్టీ నేతలు ముందుగా రాజీనామా చేయాలన్నారు. సోమవారం కాంగ్రెసు వారు రాజీనామా చేసిన వెంటనే మేమూ రాజీనామా చేస్తామని అన్నారు. అన్ని పార్టీల నేతలు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాల అనంతరం ఎన్నికలలో ఎవరూ పాల్గొనవద్దని అయన సూచించారు. మహానాడు ప్రకటనకు తాము కట్టిబడి ఉన్నామని మరో నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరబోతుందని అన్నారు.

English summary
TDP senior MLA Errabelli Dayakar Rao said today that tdp is ready to resign for telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X