• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్దుకుపోదాం, మేడం మాటగా చెప్తున్నా: అహ్మద్ పటేల్

By Pratap
|

Ahmad Patel
న్యూఢిల్లీ‌: మేడం మాటగా చెబుతున్నా, తొందరపడవద్దు, రాజీనామాలు ఉపసంహరించుకోండి అని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తెలంగాణ పార్టీ పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు నచ్చజెప్పేందుకు కాంగ్రెసు హైకమాండ్ మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఉదయం తెలంగాణ పార్టీ ప్రతినిధులతో పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు. మంగళవారం సాయంత్రం అహ్మద్ పటేల్ తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసానికి వచ్చారు. అక్కడ తెలంగాణ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు.

తెలంగాణ సమస్య చాలా సున్నితమైందని, తాము లోతుగా పరిశీలిస్తున్నామని, తొందరపడడం మంచిది కాదని చెప్పినట్లు అహ్మద్ పటేల్ కాంగ్రెసు ఎంపిలతో చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మరోసారి అహ్మద్ పటేల్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో, మంత్రులతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సారయ్య చెప్పారు. జైపాల్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ వంతుగా పాత్ర నిర్వహించాలని కోరడానికి తాము జైపాల్ రెడ్డి నివాసానికి వచ్చామని, అయితే అదే సమయంలో అహ్మద్ పటేల్ ఇక్కడికి వచ్చారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.

ప్రజాప్రతినిధుల రాజీనామాల గురించి తాము అహ్మద్ పటేల్‌కు, ఆజాద్‌కు చెప్పామని పార్లమెంటు సభ్యుడు వివేక్ చెప్పారు. ఈ రాత్రి మాత్రమే చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ తమకు ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. కాకతాళీయంగా మాత్రమే అహ్మద్ పటేల్‌తో కలిశామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. రాజీనామాల విషయమే తాము అహ్మద్ పటేల్‌కు చెప్పామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X