వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒత్తిడికి తలొగ్గి కొండా మురళి రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Murali
వరంగల్: తెలంగాణవాదుల ఒత్తిడికి తెలంగాణ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు లొంగక తప్పడం లేదు. రాజీనామాలు చేయని వారి ఇళ్లను తెలంగాణవాదులు ముట్టడించి రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారు. వారిని బయట తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు వారి ఒత్తిడికి తలొగ్గక తప్పడం లేదు. వరంగల్ జిల్లాలోని కాంగ్రెసు పార్టీ శాసనమండలి సభ్యులు కొండా మురళీధర రావు, పుల్లా పద్మావతి, దిలీప్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఇళ్లను తెలంగాణవాదులు ముట్టడించారు.

తెలంగాణవాదుల ఒత్తిడికి తలొగ్గిన కొండా మురళీ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. దిలీప్ కుమార్ సైతం రాజీనామా చేస్తానని తెలంగాణవాదులకు హామీ ఇచ్చారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి రాజీనామా సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణవాదుల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆమె ఎటూ తేల్చుకోలేక పోతోందని సమాచారం. కాగా ఇప్పటి వరకు 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కొండా మురళీ రాజీనామాతో అది 16కు చేరింది. పుల్లా పద్మావతి, దిలీప్ కుమార్ చేస్తే 18కి చేరుకుంటుంది.

English summary
Warangal district mlc Konda Muralidhar Rao resigned for his mlc today after Telangites pressure. Dilip Kumar also thinking to resign. Pulla Padmavathi is ni dilemma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X