వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి సూపర్ స్టార్ కృష్ణ దంపతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna
హైదరాబాద్‌: తెలుగు సూపర్ స్టార్ కృష్ణ దంపతులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలతో పాటు నటుడు, రాజకీయ నేత నరేష్ కూడా వైయస్ జగన్ పార్టీలోకి వెళ్తున్నారు. వీరు ముగ్గురు మంగళవారం వైయస్ జగన్‌తో గంటకు పైగా చర్చలు జరిపారు. పార్టీలో చేరడానికి త్వరలో ముహూర్తం ఖరారవుతుందని, తాము ముగ్గురం ఒకేసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతామని కృష్ణ సతీమణి, ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మల మీడియా ప్రతినిధులతో చెప్పారు.

కొత్త రక్తాన్ని, యువతను ప్రోత్సహించడానికే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. యువతను ప్రోత్సహించాలనేది పెద్దలుగా తమ బాధ్యత అని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి తమ కుటుంబ సభ్యులమంతా కృషి చేస్తామని ఆమె చెప్పారు. మానసికంగా తాము వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నామని ఆమె అన్నారు. తాను, కృష్ణ క్రియాశీలకంగా ఉండబోమని, నరేష్ మాత్రం క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటో తేలిపోయిందని నరేష్ అన్నారు. గతంలో కృష్ణ పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. నరేష్ బిజెపిలో కొంత కాలం పనిచేశారు.

English summary
Telugu super star Krishna and his wife Vijaya Nirmala decided join in YS Jagan's YSR Congress party soon. Vijaya Nirmala's son Naresh will also loin in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X