వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యమంలోకి టిడిపి: 7నుండి బస్సుయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli
హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తెలంగాణ అంతటా బస్సు యాత్రలను ప్రారంభించాలని నిర్ణయించిన తెదేపా తెలంగాణ ఫోరం నేతలు మంగళవారం నిర్ణయించారు. బుధవారం 7వ తారీఖు నుండి బస్సుయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నుండి దీన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో రోజుకో జిల్లా చొప్పున యాత్ర నిర్వహిస్తారు. మొత్తం పదిరోజులు యాత్ర నిర్వహిస్తారు. బస్సు యాత్ర తర్వాత వరుసగా ఉద్యమం చేయనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు టిడిఎల్పీలో టిడిపి నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తమను పట్టించుకోకుండా స్వంతగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నందున జెఏసికి ధీటుగా టిడిపి కూడా ఉద్యమం చేయాలని భేటీలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో స్తబ్ధగా ఉన్న పార్టీని రాజీనామాలు చేసినందున ఇక ముందు ప్రజల్లోకి తీసుకు పోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకో జెఎసి ఉద్యమం ఉన్న రోజుల్లోనే బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
TDP Telangana Fourm decided to Bus Yatra from Medchal of Ranga Reddy district from 7th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X