శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ప్రియుడి దాడిలో మరణించిన ప్రేయసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srikakulam District
శ్రీకాకుళం: మాజీ ప్రియురాలిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన సంఘన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరుకు చెందిన తులసి అనే యువతి, సుధాకర్ అనే యువకుడు ప్రేమించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తులసికి మరొకరితో పెళ్లయింది. తులసికి వేరొకరితో పెళ్లైన తర్వాత సుధాకర్ ఆమెను నిత్యం ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె నుండి రెస్పాన్సు రాకపోయే సరికి బుధవారం విసుగు చెందిన సుధాకర్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

కాగా తులసి పెళ్లి అయిన తర్వాత తన మాజీ ప్రియుడు సుధాకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిందని, రెండు మూడు రోజుల వరకు అతనితో మాట్లాడినప్పటికీ రెండు రోజులుగా అతను ఫోన్ చేసిన తీయడం లేదని దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్ ఆమెపై దాడి చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

English summary
A person attacked on his ex lover today with knife in Srikakulam district. Sudhakar attacked Tulasi, who is his ex lover with knife. She sent to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X