హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేసిన మంత్రులను బుజ్జగిస్తున్న సిఎం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాజీనామా చేసిన మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ప్రాంతంలోని పలువురు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కిరణ్ బుధవారం వారిని సచివాలయానికి పిలిపించి మంత్రి బాధ్యతలు నిర్వహించారని కోరినట్లుగా తెలుస్తోంది. కేవలం శాసనసభ్యత్వానికే రాజీనామా చేసినందున మంత్రిగా బాధ్యతలు నిర్వహించవచ్చునని రాజ్యాంగం మీద ప్రమాణ చేసి బాధ్యతలు స్వీకరించినందున బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు ఎలాంటి ఉద్రేక పూరిత ప్రకటనలు కూడా చేయవద్దని కోరినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి మంత్రులతో పాటు శాసనసభ్యులతో సైతం మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మంత్రులు, శాసనసభ్యులతో గంటపాటు మాట్లాడి రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, బాధ్యతలు నిర్వహించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే బాధ్యతలు నిర్వహించాలని సూచించిన సిఎంకు మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నందునే తాము తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశామని, బాధ్యతలు నిర్వహిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వారు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy met with resigned ministers today at Secretariat. He urged them to withdraw resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X