వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణే లక్ష్యం, మెట్టు దిగబోమన్న జానా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
న్యూఢిల్లీ‌‌: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించడమే తమ లక్ష్యమని, అందుకు వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అనుమానాలు, అపనమ్మకాలు, అపోహలు కలిగిస్తూ తమలో తమకు విభేదాలు సృష్టిస్తున్నారని, తెలంగాణ నాయకులు ఐక్యత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీలకు, సిద్ధాంతాలకు, విధానాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సాధనే అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. తమ పోరాటం విషయంలో అనుమానం తగదని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను, ప్రజాప్రతినిధుల రాజీనామాల విషయాన్ని, తాజా పరిణామాలను అధిష్టానం దృష్టికి తేవడానికే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అధిష్టానం వెంటనే చర్చలు ప్రారంభిస్తుందని అనుకుంటున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఇక కాలయాపన తగదని తాము అధిష్టానానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు, వాస్తవాలను పార్టీ అధిష్టానానికి తెలియజేయడానికి తాము రాజీనామాలు చేశామని ఆయన అన్నారు.

తమను ప్రజలు నమ్మలేని స్థితి వచ్చిందని, తెలంగాణలో పర్యటించలేని వాతావరణం ఉందని, ప్రజలు తమపై ఒత్తిడి పెంచుతున్నారని, ఈ విషయాలను అధిష్టానానికి చెప్పాలని అనుకున్నామని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె. కేశవ రావు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

English summary
Minister from Telangana region K Jana Reddy said they will not take back their resignations till the steps to be taken for Telangana state formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X