హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో రోజూ కొనసాగుతున్న తెలంగాణ బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Bandh
హైదరాబాద్‌: తెలంగాణలో బంద్‌ రెండోరోజు బుధవారం కూడా కొనసాగుతోంది. జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు కూడా తెరవడం లేదు. తెలంగాణ జిల్లాలన్నింటిలో సామాన్య జనజీవనం స్తంభించింది. సికింద్రాబాద్‌ - ఫలక్‌నుమా మార్గంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేశారు. బంద్‌కు మద్దతుగా బుధవారం అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ వైద్యులు ప్రకటించారు. బుధవారం నాటి తెలంగాణ బంద్‌లో ఈ ప్రాంత వైద్యులందరూ పాల్గొంటారని తెలంగాణ వైద్యుల ఐకాస చెప్పింది. ఈ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యకళాశాలలు, దంత వైద్యశాలల్లో అత్యవసర వైద్యసేవలు మినహా అన్ని సేవల్నీ నిలిపేయనున్నట్లు ప్రకటించింది. ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ బి.రమేష్‌ మంగళవారం మీడియాతోమాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

సింగరేణిలో ఉద్యోగులు రెండో రోజూ విధులు బహిష్కరించారు. తెలంగాణ బంద్‌ వల్ల సింగరేణికి రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 45వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండో రోజు 22 వేలమంది ఉద్యోగులు బంద్‌కు మద్దతు తెలిపారు. దీని కారణంగా మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌ సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులు నిలిచిపోయాయి.

తెలంగాణ బంద్‌ కారణంగా కాకతీయ యూనివర్శిటీ పరిధిలో నేటి నుంచి జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేశారు. దూరవిద్య, డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేయూ అధికార వర్గాలు ప్రకటించాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల బంద్‌ దృష్ట్యా బుధవారం జరగాల్సిన బీడీఎస్‌ చివరి సంవత్సరం (పీడోడాంటిక్స్‌) పరీక్షను వాయిదా వేసినట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యవిజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ తెలిపారు. వాయిదా వేసిన పరీక్ష ఈ నెల 20వ తేదీన తిరిగి నిర్వహిస్తామన్నారు.

పౌర సరఫరా గ్రేడ్‌-1, 2 ఉద్యోగాల ఇంటర్వ్యూలు బుధవారం యధాతథంగా జరుగుతాయని ఐపీఈ అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించామని, అనివార్య కారణాల వల్ల హాజరుకాని వారికి మరో రోజు నిర్వహిస్తామని చెప్పారు.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 7వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా 27వ తేదీ నుంచి జరుగుతాయని విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.

English summary
Telangana Bandh is continuing second day on wednesday. Singareni workers boycotted duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X