విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్‌కు విభజన సెగ, విజయవాడ పర్యటన రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
విజయవాడ: రాష్ట్ర విభజన సెగ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు పెద్గగానే తగిలింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన శుక్రవారంనాటి విజయవాడ పర్యటన రద్దయింది. గత నెలలో ఖరారైన కార్యక్రమం ప్రకారం ఆయన శుక్రవారం విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూం సమీపంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆజాద్ పర్యటన కోసం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ భారీ ఏర్పాట్లు చేశారు.

ముఖ్య నాయకులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లకుండా ఆపేందుకు గులాం నబీ ఆజాద్ ఒక రోజు విజయవాడ పర్యటనకు సిద్ధపడ్డారు. వెళ్లినవారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో తీరిక లేకపోవడం వల్ల ఆజాద్ రావడం లేదని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారని నగర కాంగ్రెసు అధ్యక్షుడు పైలా సోమి నాయుడు చెప్పారు.

English summary
AICC general secretary and in-charge of party's AP affairs Ghulam Nabi Azad has decided to skip his tour of Vijayawada scheduled on Friday in view of the political turmoil in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X