హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొలిక్కి వస్తున్న మద్దెలచెర్వు సూరి హత్య కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

C Kalyan-Singanamala Ramesh
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు కొలిక్కి వస్తోంది. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఆచూకీ కూడా లభ్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ నిర్మాతలు శింగనమల రమేష్, సి. కళ్యాణ్‌లను తమ కస్టడీలోకి తీసుకుని సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వారు భాను కిరణ్‌కు సంబంధించి పలు విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ ఇద్దరు నిర్మాతలు కూడా అజ్ఞాతంలో ఉన్న భాను కిరణ్‌తో సంబంధాలు నెరుపుతున్నట్లు, వీరే అజ్ఞాతంలో ఉన్న భానుకు డబ్బులు సమకూరుస్తున్నారని సిఐడి పోలీసులు అంటున్నారు. ఈ ఇద్దరికి భాను కిరణ్ ఎక్కడ ఉన్నాడనే విషయం తెలిసి ఉంటుందని వారంటున్నారు.

కాగా, శింగనమల రమేష్, కళ్యాణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరికి 600 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆస్తులు వచ్చాయి, ఆదాయ మార్గాలు ఏమిటనే విషయాలపై వారు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. భాను కిరణ్ ఆస్తులను వారి పేరు మీద పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. సూరి హత్యకు ముందే భాను కిరణ్ ఐదుగురు రియల్టర్ల నుంచి 45 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

English summary
CID enquiry revealed that film producers Singanamala Ramesh and C Kalyan are in touch with Bhanu Kiran, main culprit in Maddelacheruvu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X