హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ గుండు సుధారాణి రాజీనామా, కౌంట్ 136

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gundu Sudharani
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి గురువారం తన పదవికి రాజీనామా చేసింది. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, సిపిఐ, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల రాజీనామా అనంతరం తెలంగాణ ప్రాంతంలో రాజీనామా చేయని నేతల ఇళ్లను తెలంగాణవాదులు ముట్టడించి రాజీనామాకు ప్రతిరోజూ డిమాండ్ చేస్తున్నారు. వారిపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారు. తెలంగాణ ఒత్తిళ్లకు లొంగిన గుండు సుధారాణి ఎట్టకేలకు గురువారం రాజీనామా చేసింది. వరంగల్ జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు, దిలీప్ కుమార్‌లు సైతం తెలంగాణవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాలు చేశారు.

గుండు సుధారాణి రాజీనామాతో తెలంగాణ ఎంపీల రాజీనామా 15కు చేరింది. శాసనసభ్యుడు మిత్రసేన్ సైతం ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఎమ్మెల్యేల రాజీనామాలు 101కి చేరుకున్నాయి. ఇక పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని, రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. కానీ తెలంగాణ రాదని ఆయన వాదిస్తున్నారు. ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు 20 మంది రాజీనామా చేయగా మరో రెండు రోజుల్లో చుక్కా రామయ్య విదేశాల నుండి వచ్చి రాజీనామా సమర్పించనున్నారు.

English summary
Telugudesam Party Rajya Sabha member Gundu Sudha Rani resigned for her post today by telanganites pressure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X