హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో ఢిల్లీలో పరేడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని న్యూఢిల్లీకి తరలించే యోచనలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో రాజీనామా చేసిన ప్రజాప్రతినిధుల అందరితో పరేడ్ చేయించి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి తద్వారా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ ఏ మేర ఉందో జాతీయస్థాయిలో తెలపడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు జెఏసి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాజీనామాలు చేసిన అన్ని పార్టీల నేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన తలపెట్టిన రైల్ రోకోను రద్దు చేసి, ఆ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన 137 మంది ప్రజాప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ హైదరాబాదులో కాకుండా న్యూఢిల్లీలో పరేడ్ నిర్వహించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాజీనామాలు చేసిన అందరితో కలిసి ప్రధానమంత్రిని సైతం కలవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని అపాయింటుమెంటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముందు సైతం రాజీనామా చేసిన వారితో పరేడ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న రైల్ రోకో కార్యక్రమం ద్వారానే ఉత్తర భారతదేశానికి తెలంగాణ సెంటిమెంటును తెలియజేసినట్టుగా జెఏసి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
TJAC is thinking to parade at president building at New Delhi with resigned mlas. JAC is thinking to met prime minister also for Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X