వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్యకేసులో ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Meera Chopra
న్యూఢిల్లీ: ప్రముఖ హీరోయిన్, బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా ఓ వివాహిత హత్య కేసు వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదంలో మీరా చోప్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రుచి భట్టాన్ అనే వివాహిత గత జూన్ 28న అనుమానాస్పద స్థితిలో మరణించింది. రుచి మృతిపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. రుచియే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయిందని రుచి భర్త సుమిత్, ఆయన తల్లిదండ్రులు చెబుతుండగా, భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడని రుచి తరఫున బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్యతో మీరా చోప్రాకు లింకు ఏంటంటే మృతి చెందిన రుచి భర్త సుమిత్‌తో వివాహేతర సంబంధం ఉంది.

భర్త హత్య చేసి ఉంటాడన్న పుట్టింటి వారి ఫిర్యాదుతో పోలీసులు సుమిత్‌ను అరెస్టు చేసి విచారించారు. సుమిత్ విచారణ అనంతరం మీరా చోప్రాపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని ఢిల్లీకి పంపించారు. రుచి తరఫున బంధువులు సైతం ఈ హత్యతో మీరా చోప్రాకు ఈ హత్యతో సంబంధం ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమిత్, రుచిలకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది.

English summary
Police booked a case against bollywood heroine Priyanka Chopra's cousin, tollywood heroine Meera Chopra in murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X