హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఎమ్మెల్యేల ధిక్కారం, నో యాక్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను చూస్తే అర్థమవుతోంది. నాయకత్వాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, మరీ చెప్పాలంటే - ధిక్కరిస్తూ వైయస్సార్ కాంగ్రెసు ప్లనరీ సమావేశంలో పాల్గొన్నారు. తమ పార్టీ టికెట్‌పై శానససభకు ఎన్నికైన శాసనసభ్యులు మరో పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొనడం చూస్తుంటే వారిపై చర్యలు తీసుకునే పరిస్థితిలో తాము లేమని కాంగ్రెసు నాయకులు చాటుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ఇంతటి దయనీయ స్థితి వస్తుందని అనుకోవడానికి లేదు.

బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని అందరూ భావించారు. జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటుందని భావించారు. ఆయన దూకుడు చూస్తుంటే అలా అనిపించింది కానీ అటువంటిదేమీ లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మారితే పార్టీ గాడిలో పడుతుందని అనుకున్నారు. గాడిలో పడకపోగా మరింత విచ్చలవిడితనం పెరిగిపోయింది. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ ప్లీనరీకి వెళ్లే ధైర్యం చేశారంటే నాయకత్వ బలహీనత కూడా వైయస్ జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులకు పూర్తిగా తెలిసిపోయినట్లే ఉంది.

ప్లీనరీలో పాల్గొనడమే కాదు, వైయస్సార్ పార్టీని సొంతం చేసుకుంటూ కొంత మంది మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వేదికపై నుంచి మాట్లాడారు కూడా. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు, వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తిరుగుబాటు చూస్తుంటే కాంగ్రెసు పార్టీ నాయకత్వ అసమర్థత స్పష్టమవుతోందని అంటున్నారు.

English summary
Congress MLAs with resigning for party, participated in YS Jagan's YSR Congress party plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X