వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర కాలేజీలకు క్యూ కడుతున్న తెలంగాణ విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Students
విజయవాడ: తెలంగాణ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ విషయమై ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలతో అట్టుడుకుతున్న పరిస్థితిలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంధ్ర కళాశాలల్లో చేర్పిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. విజయవాడ, గుంటూరు కళాశాలల్లో చేరడానికి తెలంగాణ నుంచి పెద్ద యెత్తున విద్యార్థులు ముందుకు వస్తున్నారు. ఎంసెట్ కోచింగ్ కోసం ఎక్కువగా విద్యార్థులు ఈ కళాశాలల్లో చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యతో కలిపి ఎంసెట్ కోచింగ్‌ను అందించే కళాశాలలు చైతన్య, నారాయణ.

చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలు హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోనే కాకుండా తెలంగణ ప్రాంత జిల్లాల్లో కూడా పెద్ద యెత్తున వెలిశాయి. ఈ కళాశాలలు రాక ముందు తెలంగాణ విద్యార్థులు ప్రత్యేకంగా కోచింగ్ కోసం ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుండేవారు. అవి తమకు అందుబాటులోకి రావడంతో అలాంటి వలసలు తగ్గాయి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆందోళనల కారణంగా ఆటంకాలు ఎదురవుతుండడంతో మళ్లీ తెలంగాణ విద్యార్థులు అటు వైపు చూస్తున్నారు. ఈ ఏడాది నిరుటితో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం పెరిగిందని అంటున్నారు.

English summary
They may be espousing the Telangana cause, but when it comes to the education of their wards, the champions of the separate state are not taking any chances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X