వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి - టిడిపిలో నేతల్లో విభేదాలు, అదేమీ లేదన్న ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
వరంగల్: తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజీనామాలు చేయగానే కాంగ్రెసు పార్టీ కన్నా ముందు ఉండడానికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ కొట్టడానికి హుటాహుటిన వారు తెలంగాణ జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సు యాత్ర జరుగుతున్న క్రమంలో వారిలో విభేదాలు పొడసూపినట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో నిర్వహించే బస్సు యాత్రపై భేదాభిప్రాయాలు పొడసూపినట్లు చెబుతున్నారు

తమ మధ్య ఏ విధమైన విభేదాలు లేవని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం అన్నారు. నల్లగొండ జిల్లా బస్సు యాత్ర విషయంలో ఆ జిల్లా నాయకులు పదే పదే రూట్లు మారుస్తున్నారని, ఈ విషయంపై నల్లగొండ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థులకు ఏదైనా హాని జరిగితే తమ బస్సు యాత్రను అక్కడికి మళ్లిస్తామని ఆయన హెచ్చరించారు. తెరాస పదేళ్లు పోరాటం చూసి కూడా తెలంగాణను సాధించలేకపోయిందని, తమకు ఒక ఏడాది ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు.

English summary
It is learnt that differences cropped up among TDP Telangana leaders. But TDP Telangana forum convemor is condemning those reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X