వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావూరికి కేంద్ర మంత్రి పదవి, పది కొత్త ముఖాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

KS Rao
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో ఒకరికి చోటు కల్పించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఆ స్థితిలో కావూరి సాంబశివరావుకు మంత్రి పదవి దక్కవచ్చునని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చెలరేగుతున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోకూడదని తొలుత అనుకున్నారు.

అయితే, మారిన పరిస్థితిలో కావూరి సాంబశివరావుకు అవకాశం కల్పించాలని అనుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి, కిశోర్ చంద్రదేవ్, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ కూడా రాష్ట్రం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కానీ, సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న కావూరికి మంత్రి పదవి ఇస్తే తెలంగాణ సమస్యకు పరిష్కరించడం సులభమవుతుందని ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ నేతలు మరింతగా అశాంతిని సృష్టిస్తారని భావిస్తే మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి.

కాగా, రేపు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారు. కొత్తగా పది మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. డిఎంకె నుంచి ఒకరికి కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బహుశా, టిఆర్ బాలుకు ఆ అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు కేబినేట్ హోదా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కపిల్ సిబల్ నుంచి ఒక శాఖను తప్పిస్తారని అంటున్నారు. మంత్రుల శాఖలు భారీగా మారే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తొలి నలుగురు సీనియర్ మంత్రులను మాత్రం ఏ రకంగానూ కదిలించే అవకాశాలు లేవని చెబుతున్నారు.

English summary
It is said that Kavuri Sambasiva Rao may get cabinet berth in Manmohan's reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X