వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదులను చితకబాదిన తెలుగు తమ్ముళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

seethakka
వరంగల్: తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర నాలుగో రోజు కాస్త ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రెండుమార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బస్సు యాత్ర మధ్యాహ్నం వరంగల్ జిల్లాలోని హన్మకొండకు చేరుకుంది. హన్మకొండ చౌరస్తా వద్ద బస్సు యాత్రను అడ్డుకునేందుకు సుమారు పది మంది విద్యార్థులు ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలంగాణపై వైఖరి తెలుపకుండా బస్సు యాత్ర చేసే నైతిక హక్కు లేదని విద్యార్థులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.

అయితే విద్యార్థులు ఎంతకూ వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. రెచ్చిపోయన తెలుగు తమ్ముళ్లు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. నేతలు మాత్రం విద్యార్థులపై చేయి చేసుకోవద్దని సూచించారు. ఎవరో పది పదిహేను మంది వచ్చి అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తారని వారిని పట్టించుకోవద్దని సూచించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా హుజురాబాదు పట్టణంలో ఒక తెలంగాణవాది చంద్రబాబు వైఖరిని ప్రశ్నించారు. అక్కడ సైతం తెలుగు తమ్ముళ్లు ఆయనపై దాడి చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.

హన్మకొండ చౌరస్తాలో సీతక్క మాట్లాడుతూ కాంగ్రెసు, టిఆర్ఎస్ పార్టీలను తీవ్రంగా విమర్శించింది. తెలంగాణకు కాంగ్రెసు పార్టీయే ప్రధాన శత్రువు అని విమర్శలు గుప్పించారు. కావాలనే కొందరు టిడిపిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే కొన్ని పార్టీలు ఉన్నాయని తెలంగాణ రావాలని మాత్రం కాదని టిఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. టిడిపిని నిర్మూలించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు టిడిపి ఉద్యమిస్తుందని అన్నారు.

English summary
Telugudesam party leaders attacked on telanganites today in Warangal and Karimnagar. KU students obstructed tdp bus yatra in Hanamkonda chourasta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X