వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొయిలీ తోక కట్, జైరాం రమేష్‌కు ప్రమోషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jairam Ramesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంత్రి వర్గం విస్తరణలో ఆరుగురికి ఉద్వాసన పలికి ఏడుగురు కొత్త వారిని తీసుకున్నారు. మంత్రివర్గంలో డిఎంకెకు స్థానం లేదు. ఐదుగురికి కొత్తగా సహాయ మంత్రి పదవులను కేటాయించారు. తొమ్మిది మందికి ఇండిపెండెంట్ చార్జ్ ఇచంచారు. మన రాష్ట్రానికి చెందిన సాయి ప్రతాప్‌కు మంత్రివర్గం నుండి ఉద్వాసన పలికి కిషోర్ చంద్రదేవ్‌కు కేబినెట్ హోదా కల్పించారు. ఆయనకు పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కొత్తగా నలుగురికి కేబినెట్ హోదా కల్పించారు. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన దినేష్ త్రివేదికి రైల్వే శాఖను, బేణి ప్రసాద్ వర్మకు ఉక్కుశాఖను, న్యాయశాఖ మంత్రిగా సల్మాన్ ఖుర్షీద్‌ను నియమించారు.

జయంతి నటరాజన్‌కు పర్యావరణం, షిప్పింగ్ కార్పోరేషన్‌కు ముకుల్ రాయ్, జైరాం రమేష్‌కు గ్రామీణాభివృద్ధి, విలాస్ రావు దేశ్‌ముఖ్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ, సుదీప్ బందోపాధ్యాయకు హెల్త్ అండ్ ఫ్యామిలీ, వీరప్ప మొయిలీకి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్, సుదీప్ బందోపాధ్యాయ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా జైపాల్ రెడ్డి శాఖ మార్చలేదు. కిషోర్ చంద్రదేవ్‌కు కేబినెట్ హోదా కల్పించడంతో రాష్ట్రానికి రెండో కెబినెట్ పదవి లభించినట్లయింది. సాయి ప్రతాప్, ఎంఎస్ గిల్, హ్యాండిక్, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, దయానిధి మారన్ తదితర ఆరుగురిని మంత్రివర్గం నుండి తొలగించారు. వాణిజ్య శాఖ మంత్రిగా ఆనంద్ శర్మను తీసుకున్నారు. ఇందులో కొందరికి శాఖలు మార్పిడి చేశారు. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా పని చేసిన వీరప్ప మొయిలీని న్యాయశాఖ మంత్రి నుండి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్ శాఖకు మార్చారు.

English summary
Central Minister Jairam Ramesh get promotion in cabinet reshuffle. He get rural development ministry. Now he get cabinet post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X