వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దివంగత వైయస్ సిఫారసు చేసిన కేంద్రమంత్రిపై వేటు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sai Pratap
న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సిఫారసు చేసిన కేంద్ర మంత్రికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. కడప జిల్లా పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్‌ను అధిష్టానం మంత్రి వర్గం నుండి తొలగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2009 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సాయి ప్రతాప్‌కు దివంగత వైయస్ సిఫారసులతోనే సహాయమంత్రి పదవి దక్కినట్టు సమాచారం. వైయస్ మృతి తర్వాత ఈ రెండేళ్ల కాలంలో కడప జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి ప్రతాప్ అదే జిల్లాకు చెందిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో విఫలం అవుతున్నాడనే కారణంతో ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయి ప్రతాప్‌ను తొలగిస్తారనే ఊహాగానాలు న్యూఢిల్లీలో బాగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని నిత్యం విమర్శిస్తున్న వైయస్ జగన్‌పై సాయి ప్రతాప్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేంద్రమంత్రి వర్గంలో ఉన్నప్పటికీ ఆయన జగన్ విమర్శలపై ఏమీ మాట్లాడకుండా తటస్థంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయనను తొలగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో కిషోర్ చంద్రదేవ్‌ను తీసుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సైతం ఒకరికి సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

English summary
It seems, Congress high command may remove central minister Sai Pratap, who sacrificed by late YS Rajasekhar Reddy. He ma replaced by Kishore Chandradev.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X