వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసులోనే ఉంటా, చివరి శ్వాస పార్టీలోనే: సాయి ప్రతాప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sai Pratap
న్యూఢిల్లీ: తాను తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని మరో పార్టీలో చేరే ప్రసక్తి లేదని మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మంగళవారం అన్నారు. కడప ఉప ఎన్నికల్లో తాను పూర్తిస్థాయిలో కాంగ్రెసు గెలుపు కోసం కృషి చేశానని అన్నారు. తన నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తెలుసునని చెప్పారు. పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. అధిష్టానం అన్ని ఆలోచించే తన రాజీనామాను కోరిందని చెప్పారు. పార్టీ అభివృద్ధికి తన సేవలు ఉపయోగించుకునే ఆస్కారం ఉందని తాను భావిస్తున్నానని అన్నారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా పేరుపొందిన సాయి ప్రతాప్ వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకే చెందినప్పటికీ ఆయనను ఎదుర్కొనడంలో తటస్థంగా ఉంటున్నాడన్న కారణంగానే ఆయనను తొలగించినట్లుగా తెలుస్తోంది. గత కడప ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం శ్రమించలేదని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీపై జగన్ ధాటిగా విమర్శలు చేస్తున్నప్పటికీ మంత్రి స్థాయిలో ఉన్న సాయి ప్రతాప్ వాటిని తిప్పి కొట్టక పోవడం అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Former union minister Sai Pratap said today that he was not unhappy with high command attitude. He confirmed that he will be in congress till his life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X