హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహారాష్ట్రలో భానుకిరణ్ లొంగుబాటు, షరతులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ మహారాష్ట్రలోని సూరత్ సమీపంలోని ఓ పట్టణంలోని కోర్టులో లొంగిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే భానుకిరణ్ లొంగిపోయినట్లు పుకార్లు వినిపిస్తున్నప్పటికీ సిసిఎస్ పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. భాను లొంగిపోయిన విషయమేమీ లేదని చెబుతున్నారు. కాగా భానుకిరణ్ తాను లొంగిపోవడానికి నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను లొంగిపోయేందుకు పోలీసుల ముందు షరతులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. భాను తాను వెళ్లేటప్పుడు తీసుకు వెళ్లిన డబ్బులు కాకుండా ఇటీవల మూడు నెలల కాలంలో ముప్పై లక్షలు ఆయనకు చేరినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుకిరణ్ అజ్ఞతంలో ఉండటానికి ఎవరో సాయం చేస్తున్నందునే ఆయన ఆటలు సాగుతున్నాయని భావించిన పోలీసులు భానుకు వెళ్లి డబ్బుపై పూర్తిగా నిఘా పెట్టారు.

దీంతో భానుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అజ్ఞాతంలో ఉంటే ప్రాణభయం కూడా భానుకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాగే అజ్ఞాతంలో ఉంటే కష్టమని భావించిన భాను కిరణ్ తాను లొంగిపోతే బెయిలు తీసుకొని బయటకు రావచ్చని భావించి లొంగిపోయేందుకు సిద్దపడినట్లుగా తెలుస్తోంది. భానుకు పోలీసులకు మధ్యన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు రాజకీయవేత్తలు రాజీకుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారు అంతగా పలుకుబడి లేని నాయకులు కావడం గమనార్హం. వారి వెనుక ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇచ్చిన ఆధారాలను బట్టి భానుకిరణ్ ఎక్కడ ఉన్నాడో, ఆయనకు డబ్బు ఎలా వెళుతుందో అనే అంశాన్ని పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. కాగా గతంలోనూ తిరుపతిలో భాను లొంగిపోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
The rumors were came out Bhanu Kiran was surrendered to police in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X