వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైని ఇరాక్‌, అఫ్షాన్‌లతో పోల్చిన రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
భువనేశ్వర్: ముంబై వరుస బాంబు పేలుళ్లపై కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడులు సాధారణమేనని, వాటిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. ముంబైని ఇరాక్, అఫ్గానిస్తాన్‌లతో పోల్చారు. దేశంలో 99 శాతం ఉగ్రవాద దాడులను ఆపగలుగుతున్నామని కాంగ్రెసు యువరాజు అన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పలు చర్యలు తీసుకోవడం వల్ల అది సాధ్యమైందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఉగ్రవాద దాడులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తాము 99 శాతం దాడులను ఆపగలుగుతున్నామని, ఒక్క దాడిని ఆపడమే కష్టమవుతోందని ఆయన అన్నారు. వందశాతం దాడులను నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబై వరుస పేలుళ్లపై స్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.

ముంబై పేలుళ్ల విషయంలో ప్రభుత్వం సరిగానే స్పందించిందని, పూర్తిగా వ్యవస్థీకృత పద్ధతిలో ప్రభుత్వం స్పందిస్తోందని ఆయన అన్నారు. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించడం సర్వసాధారణమని, అయితే ఎన్నిటిని నిరోధించినా ఒక్క దాడిని నిరోధించలేకపోతున్నామని ఆయన అన్నారు. అమెరికాలోనూ ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

English summary
Congress General Secretary Rahul Gandhi on Thursday said that 99 per cent of the terror attacks had been stopped in the country, thanks to various measures, including improved intelligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X