వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమవారి మృతదేహాల కోసం బంధువుల ఆరాటం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blast
ముంబై: ముష్కర మూకల మారణహోమంతో అట్టుడికిన ముంబయ్ ప్రాంతం పలు కుటుంబాల్లో విషాదఛాయలను మిగిల్చింది. సాయం సంధ్యవేళ షాపింగ్ కు వెళ్లిన తమ వారు తీవ్రవాదులు పన్నిన ఉచ్చుల ఇరుక్కుని అసువులు బాశారు. ప్రాణాలతో బయటపడిన వారు ఆసుపత్రిల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. దాదర్, ఓపెరా హౌస్, జావేరీ బజార్ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను అమర్చిన ఉగ్రవాదులు 14 నిమిషాల వ్యవధిలో 18 మందిని బలిగొనటంతో పాటు 131 మందిని క్షతగాత్రులను చేశారు.

పేలుడు ఉదృతి దాటికి పలు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. లభ్యమైన 18 మృతదేహాల్లో ఇప్పటి వరకు 14వాటిని గుర్తించారు.గాయాలుపాలైన 131 మందిలో 23మంది పరిస్థితి ఆందోళణకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మృతులు తాలుకా కుటుంబీకులు తమ వారి కోసం ఆసుపత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. క్షతగాత్రులతో నిండిన 13 ఆసుపత్రులు భాదితుల హృదయ రోదనలతో దర్శనమిస్తున్నాయి.

English summary
families of the victims are waiting to take bodies. in blasts 18 died and 131 injured 23 members are in critical position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X