వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుళ్లపై ముజాహిదీన్ టెర్రరిస్టులు ముందే చెప్పారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blasts 2011
ముంబై: మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం చేతిలో అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు ముందే వరుస పేలుళ్ల గురించి సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. వారి మాటలను విశ్లేషించడంలో విఫలం కావడం వల్లనే బుధవారంనాటి పేలుళ్లను నివారించకలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం ఇటీవల ఇద్దరు ముజాహిదీన్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వరుస పేలుళ్లకు పన్నిన పన్నాగం గురించి వారు విచారణలో సూచనప్రాయంగా వెల్లడించినట్లు చెబుతున్నారు.

అరెస్టయిన మొహమ్మద్ మొబిన్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఇర్ఫాన్, అయూబ్ రాజా అమీన్ షేక్ ఓ శాఖ ముంబైలోనే కాకుండా గుజరాత్‌లో కూడా వరుస పేలుళ్లకు ప్రయత్నిస్తోందని చెప్పారని అంటున్నారు. మారణాయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని మన్‌ఖుర్ద్‌లో అరెస్టు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్లు, సూరత్‌లో పేలుళ్ల యత్నం, ముజాహిదీన్ పంపిన మెయిల్స్ వంటి విషయాలపై ఆ ఇద్దరిని అధికారులు విచారించారు. కానీ, జరగబోయే పేలుళ్ల సమాచారాన్ని వారు గ్రహించలేకపోయారు.

English summary
As per some reports, the two Indian Mujahideen terrorists, who were nabbed by the Maharashtra ATS recently, had during interrogation, hinted at a module working to carry out serial blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X