వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్ల వెనక అండర్ వరల్డ్ పాత్ర?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blasts 2011
ముంబై: ముంబై వరుస పేలుళ్ల వెనక అండర్ వరల్డ్ పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో ముంబైలో అండర్ వరల్డ్ కార్యకలాపాలు మళ్లీ పుంజుకున్నాయని చెబుతున్నారు. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ముంబైలో పేలుళ్లు సంభవించడం వెనక అండర్ వరల్డ్ పాత్ర ఉందనడానికి తగిన ఆధారాలున్నాయని అంటున్నారు. అండర్ వరల్డ్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కూడా చాలానే ఉంది. జర్నలిస్టు జె డే హత్య, దావూద్ ఇబ్రహీం సోదరుడి డ్రైవర్‌పై దాడి వంటి సంఘటనలకు అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

అండర్ వరల్డ్‌కు చెందిన కొన్ని గ్రూపుల మధ్య సయోధ్య కూడా కుదిరిందని అంటున్నారు. ముంబైలో పకడ్బందీ నెట్‌వర్క్, బలమైన స్థానిక మద్దతు ఉంటేనే ఇటువంటి వరుస పేలుళ్లకు పాల్పడడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. వేరే వాళ్ల ఆర్థిక సహాయంతో అండర్ వరల్డ్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.

హర్కత్ - ఉల్ - జిహాద్ - ఆల్ - ఇస్లామీ (హుజీ) ముంబై, హైదరాబాద్, బెంగళూర్, కోల్‌కత్తా నగరాల్లో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని మూడు రోజుల క్రితం కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో పేలుళ్లు సంభవించాయి. బిఎస్ఎఫ్ ఇచ్చిన ఈ హెచ్చరికల గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. ఈ సమాచారం బిఎస్ఎఫ్‌కు బంగ్లాదేశ్ నుంచి అంది ఉంటుందని భావిస్తున్నారు.

మరో కోణం కూడా అందులో కనిపిస్తోంది. కాశ్మీరీ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. జులై 13వ తేదీని కాశ్మీరీ ఉగ్రవాదులు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 1931 జులై 13వ తేదీన దోగ్రా బలగాలు 22 మంది కాశ్మీరీలను కాల్చి చంపాయి. కాశ్మీరీలకు అంతటి శక్తి లేదనే మాట కూడా వినిపిస్తోంది. అయితే, ఈ పేలుళ్లకు లష్కరే తోయిబా సహకారం పొంది వచ్చునని అనుమానిస్తున్నారు.

English summary
The security establishment was scrambling on Wednesday for any specific inputs that would give indications of who may have been behind the serial blasts that interrupted the past few months of lull from terror.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X