వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరుడి మృత దేహాన్నిచూసి చలించిన ఆఫ్ఘన్ అద్యక్షుడు కర్జాయ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Karzai
సోదరుడు అహ్మద్ వాలి కర్జాయ్ మ్రుత దేహాన్ని చూసి ఆఫ్ఘన్ అద్యక్షుడు కర్జాయ్ అత్యధిక జనసమూహం ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సమాధి వద్ద కూర్చొని అంతిమ నివాళులర్పించారు. అంత్యక్రియలైన వెంటనే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న కాంధహార్ నగరంలో పెద్దపెట్టున ప్రేలుడు ధ్వనులు వినవచ్చాయి. పేలుళ్ళ సమాచారం తెలియరాలేదు. అద్యక్షుడు కర్జాయ్ ని ఎంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అంత్యక్రియలకు తీసుకు రావటం జరిగింది. అంత్యక్రియల స్ధలం అయిన కర్జ్ గ్రామం కాంధహార్ నగరానికి సుమారు 20 కి.మీ. దూరంలో వుంది. కర్జాయ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని ప్రముఖ నేతలు వాలి కర్జాయ్ కు వారసుడుగా రానున్న గుల్ ఆగా షెర్జాయ్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. గుల్ ఆగా షెర్జాయ్ ప్రస్తుతం నంగార్హర్ పట్టణానికి గవర్నర్ గా వున్నారు.

ఇక హ్మద్ వాలి కర్జాయ్ ని ఆయనకు ఎంతో కాలంగా నమ్మిన బంటుగా తన కుటుంబ సభ్యులకు సెక్యూరిటీగా వున్న బాడీగార్డు హత్య చేశాడు. అహ్మద్ వాలి కర్జాయ్ దక్షిణ ఆఫ్గనిస్తాన్లో మంచి ప్రాబల్యం వున్నవాడు. ఈ హత్యతో కాంధహార్ ప్రాంతమంతా రాజులేని రాజ్యమై అట్టుడికిపోతోంది. కాంధహార్ ప్రాంతం అసలే తాలిబన్ల పుట్టినిల్లు కాగా ఇటీవల అమెరికా సైనికుల దాడులతో మరింత హింసాత్మకంగా తయారైంది. అహ్మద్ అలి కర్జాయ్ పై అనేక అవినీతి ఆరోపణలు వున్నాయి. మత్తు పదార్దాల వాణిజ్యంతో సంబంధాలున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి. హత్య చేసిన వెంటనే అతన్ని వాలి కర్జాయ్ బాడీ గార్డులు కాల్చి వేసిన విషయం తెలిసిందే.

English summary
Two explosions were heard in Kandahar city by a Reuters witness soon after the burial, adding to tensions. It was not immediately clear what caused the blasts or whether they were any casualties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X