వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబమరిమల: నటి జయమాలకు కోర్టు సమన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayamala
తిరువనంతపురం: కన్నడ నటి జయమాలకు కేరళ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ ముందు సెప్టెంబర్ 18వ తేదీన హాజరు కావాలని కోర్టు ఆమెను ఆదేశించింది. శబరిమల ఆలయం విషయంలో ఆమె హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు. జయమాలతో పాటు జ్యోతిష్కుడు పి. ఉన్నికృష్ణ, ఆణె సహాయకుడు రఘుపతికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

తాను 1987లో శబరిమల దేవుడిని తాకానని చెప్పిన జయమాల మాటలపై వివాదం చెలరేగడంతో, అది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపిస్తూ కేరళ నేరపరిశోధన విభాగం పోలీసులు నిరుడు డిసెంబర్‌లో దర్యాప్తు చేపట్టారు. రసజ్వల కానీ ఆడపిల్లలు, మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు మాత్రమే తనను ఆలయంలోకి ప్రవేశించాలని అయ్యప్ప ఆదేశించినట్లు చెబుతారు. ఇతర మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతారు. దీంతో జయమాల ఆలయంలోకి ప్రవేశించడంపై 2006లో తీవ్ర వివాదం చెలరేగింది.

ఆ వివాదంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితులు కావాలని ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని చార్జిషీట్ దాఖలైంది .

English summary
A Kerala court on Friday asked Kannada actress Jayamala to appear before it on Sep 18 in connection with a case against her for allegedly violating religious sentiments at the famed Hindu temple at Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X