హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రులతో బొత్స చర్చలు విఫలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాజీనామాలు ఉపసంహరించుకుని విధులకు హాజరు కావాలని బొత్స మంత్రులను కోరారు. అందుకు వారు నిరాకరించారు. తెలంగాణ మంత్రులు సారయ్య, డికె అరుణ, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చర్చలు మూడున్నర గంటల పాటు సాగాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకుండా రాజీనామాలను ఎలా వెనక్కి తీసుకుంటామని మంత్రులు బొత్సను అడిగినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుందని వారు తెగేసి చెప్పారు. కనీసం సంప్రదింపులు జరుపుతామనే హామీ కూడా తమకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విధమైన హామీ రాకుండా రాజీనామాలను ఉపసంహరించుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, అందుకు తాము సిద్ధంగా లేమని వారు చెప్పారు.

పార్టీ అధిష్టానంతో తెలంగాణపై చర్చలు జరపాలని, తమ మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని మంత్రులు బొత్స సత్యనారాయణకు సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణపై త్వరలో ఓ ప్రకటన వస్తుందని బొత్స సత్యనారాయణ వారికి చెప్పినట్లు సమాచారం. వారంలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ పార్టీ అధిష్టానం నుంచి గానీ ప్రకటన రావచ్చునని ఆయన మంత్రులతో చెప్పారని అంటున్నారు.

English summary
PCC President Botsa Satyanarayana's talks with ministers from Telangana region failed. Ministers rejected withdraw resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X